Marketing Strategies

All sorts of creative work at one platform

అవును, ఈటల రాజేందర్‌ను టీఆర్‌ఎస్‌ వద్దనుకుంది..

Trs-wants-to-trouble-etela-rajender
Etela Rajender

April 30: మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు.. సిట్టింగ్‌ జడ్జ్‌తో విచారణ జరిపించాలని కోరిన ఈటల.

టీఆర్‌ఎస్‌ పార్టీలో, ప్రభుత్వంలో తీవ్ర చర్చనీయాంశం. 100 ఎకరాలు కబ్జాకు పాల్పడ్డారని ఆరోపణలు. విచారణకు ఆదేశించిన సీఎం కేసీఆర్‌.

ఉద్యమ నాయకుడంటే టీఆర్‌ఎస్‌లో గుర్తుకొచ్చే పేరు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రి ఈటెల రాజేందర్‌ కూడా. కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించనప్పటి నుంచి ఆయనకు అండదండలు అందించింది, వెన్నెముగా నిలిచింది ఈటెల రాజేందర్‌ అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి ఈటెలకు ఇప్పుడు కష్టం వచ్చింది. ప్రత్యర్థులు అందరూ ఏకైనా ఒక్కసారిగా ఆయన మీద పడ్డారని చెప్పేందుకు ఏప్రిల్‌ 30న చోటుచేసుకున్న పరిణామాలే అందుకు నిదర్శనం. ఆ పార్టీ అనకూల టీవీ ఛానల్, వ్యతిరేక టీవీ ఛానల్‌ అని తేడా లేకుండా అన్ని టీవీ ఛానలల్లో ఒక్కటే వార్త. మంత్రి ఈటెల భూకబ్జా..

‘మంత్రి ఈటెల భూకబ్జా’

అంటూ నిరంతర ప్రసారాలు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన టీవీ న్యూస్‌ ఛానల్‌ నేరుగా మంత్రి ఈటెలను టార్గెట్‌ చేసేసింది. మంత్రి హోదాలో ఉండి భూకబ్జాలకు పాల్పడ్డారని నిర్ధారించేస్తూ కథనాలు ప్రసారం చేసేసింది. ఒకటి కాదు రెండు కాదు వందల కోట్ల విలువైన భూమిని.. బడుగులు బలహీన వర్గాలకు చెందిన భూమిని మంత్రి హోదాలో ఉండి గుంజుకోవాలని చూశారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌. ఈటలపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వెనువెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ విచారణకు ఆదేశించారు. అచ్చంపేట, హకీంపేట ప్రాంతాల్లో 100 ఎకరాల భూమిని మంత్రి ఈటెల కబ్జా చేశారని పలువురు ఆరోపించారు. దీంతో జమునా హ్యాచరీస్‌ కోసం ఆయన భూకబ్జాకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. దీంతో దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.

ఈటలను టీఆర్‌ఎస్‌ వెళ్లిపొమ్మని చెప్పేసినట్టే!

టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి బయటకుపొమ్మని మంత్రి ఈటలను అధిష్టానం స్పష్టంగా చెప్పేసినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీకి చెందిన టీవీ ఛానల్‌లో ఏకంగా మంత్రి ఈటల భూకబ్జాకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ కథనాలు ప్రచూరించడం, అలాగే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే పలు ఛానళ్లు వరుస కథనాలు వేయడం అన్ని కూడా టీఆర్‌ఎస్‌ నుంచి, ప్రభుత్వం నుంచి మంత్రి ఈటలను పొమ్మనలేక పొగబెడుతున్నట్టు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమమవుతున్నాయి. గత కొన్ని నెలలుగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈటల పార్టీ అధిష్టానంపై, ప్రభుత్వంలోని ముఖ్య నేతలపై పరోక్షంగా తీవ్ర విమర్శలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటిపై మంత్రి కేటీఆర్‌ కూడా పరోక్షంగానే బదులివ్వాల్సి వచ్చింది. ఇన్ని పరిణామాలపై మధ్య మంత్రి ఈటల తనదారి తాను చూసుకోవడం ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.

నా చరిత్ర చెరిపేస్తే చెరగనిది : మంత్రి ఈటల
తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన మంత్రి ఈటల.. కొన్ని టీవీ ఛానళ్లు పనిగట్టుకొని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని, సభ్య సమాజం అసహ్యించుకొనేలా ప్రసారాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తన చరిత్ర చెరిపేస్తే చెరగదని.. తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించుకోవాలన్నారు. ధర్మం కోసం.. ప్రజల కోసం ఎప్పటికీ కొట్లాడుతానని ఆయన స్పష్టం చేశారు.

మంత్రి ఈటలను వెళ్లిపొమ్మని చెప్పేశారు!

జావీద్‌ బాషా టప్పాళ్‌

26 thoughts on “అవును, ఈటల రాజేందర్‌ను టీఆర్‌ఎస్‌ వద్దనుకుంది..

  1. I have read your article carefully and I agree with you very much. This has provided a great help for my thesis writing, and I will seriously improve it. However, I don’t know much about a certain place. Can you help me?

Leave a Reply

Your email address will not be published.