Marketing Strategies

All sorts of creative work at one platform

మార్కెటింగ్‌ స్ట్రాటజీస్‌.ఇన్‌– ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం కీలక విజ్ఞప్తి

కరోనావైరస్‌ మొదటి వేవ్‌ తరువాత ఎవ్వరూ ఊహించనంత స్థాయిలో సెండ్‌వేవ్‌ దేశంలో తీవ్ర రూపం దాల్చింది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా హృదయవిదారక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

వైద్య పరంగా దేశంలో ఉన్న వసతుల కొరత వైరస్‌ ప్రభావం, బాధితుల సంఖ్యను రోజురోజుకు మరింతగా పెంచుతోంది. ఆక్సీజన్‌ కొరతతో ప్రజలు ఆస్పత్రుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్య చికిత్సకు సరిపడా బెడ్లు లేక తీవ్ర ఆందోళనకు గురతున్నవారు కొందరు. భారత్‌ ఎదుర్కొంటున్న పరిస్థితి చూసి సాయం చేసేందుకు యావత్తు ప్రపంచ మానవతావాదులు ముందుకొస్తున్నారు. అగ్రరాజ్య అమెరికా ఇప్పటికే వైద్యపరంగా అవసరమైన సదుపాయాలను భారత్‌కు పంపింది. వైరస్‌ నివారణకు ప్రతిఒక్కరూ చర్యలు తీసుకోవాలని దేశంలో ప్రముఖులు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వీడియో రూపంలో తమ సందేశాన్ని వ్యక్తం చేశారు.

తెలుగులో ఆలియా భట్‌..

ఈ వీడియోలో చిత్రంలోని ప్రధాన తారాగణం ఎన్టీఆర్, రాంచరణ్, ఆలియా భట్, అజయ్‌ దేవగణ్, దర్శకుడు రాజమౌళి తమ సందేశాన్ని వివిధ భాషల్లో వ్యక్తం చేశారు. అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, మాస్కులు ధరించాలి, తరచూ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని, అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కోరారు. దేశం కోసం, కుటుంబంకోసం, స్నేహితులందరి కోసం జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మళయాళం భాషల్లో విడుదలవుతున్న విషయం తెలిసింది. ఈ వీడియోలో ఆలియా భట్‌ తెలుగులో తన సందేశాన్ని పంచుకున్నారు. రామ్‌చరణ్‌ తమిళంలో, ఎన్టీఆర్‌ కన్నడ, రాజమౌళి మళయాళంలో, అజయ్‌ దేవగణ్‌ హిందీలో తమ సందేశాన్ని ప్రజలతో పంచుకున్నారు.

157 thoughts on “మార్కెటింగ్‌ స్ట్రాటజీస్‌.ఇన్‌– ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం కీలక విజ్ఞప్తి

  1. I agree with your point of view, your article has given me a lot of help and benefited me a lot. Thanks. Hope you continue to write such excellent articles.

Leave a Reply

Your email address will not be published.