Marketing Strategies

All sorts of creative work at one platform

వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహం ఏంటి..!

Prashant kishor-Next step

దేశంలో ఎన్నో రాజకీయ పార్టీల విజయాల వెనుక ఆతని వ్యూహ ప్రతివ్యూహాలు ఉన్నాయి. అతని వ్యూహ రచన వెనుక సర్వశక్తులు ఒడ్డి తయారు చేసిన లెక్కాపత్రాలు ఉంటాయి. అతనొక సలహా ఇచ్చాడంటే.. దాని కోసం అతని సైన్యం ఒక మినీ యుద్ధమే చేసిందని భావించాల్సిందే. అధికారంలోకి వచ్చేందుకు, ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు, అప్పటికే తమకు ఉన్న బలాబలాలను మెరుగుపరుచుకొనేందుకు రాజకీయలు పార్టీలు కోరుకునే వ్యక్తి ప్రశాంత్‌ కిషోర్‌.

అలాంటి వ్యక్తిని ఏ రాజకీయ పార్టీ అయినా వద్దంటుందా!.. అనగలదా!. ఎంతమంది తనను కావాలని కోరుకున్నా.. ఎంత ఖరీదైనా ఫర్వాలేదు, చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినా.. డబ్బు కోసం ఎవరితోపడితే వారితో పని చేయనని తెగేసి చెప్పే నైజం ప్రశాంత్‌ కిషోర్‌ సొంతం. నేను ఎవరితో పనిచేయాలని కోరుకుంటానో వారితోనే చేస్తాను తప్పా.. ఎవరికిపడితే వారికి పనిచేయనని బాహాటంగా చెప్పే మనస్తత్వం. అలాంటి పీకే ఒక్కసారి పనిచేసేందుకు ఒప్పుకున్నాడంటే.. అతని వ్యూహాలు ప్రత్యర్థుల ఊహలకు కూడా అందని పరిస్థితులు కల్పిస్తాడు. ఏ వ్యూహం ర చించినా, ఏ సలహా ఇచ్చినా దాని వెనుక పక్కా ప్రకాళిక ఉంటుంది. అలాంటి ప్రశాంత్‌ కిషోర్‌ బెంగాల్‌ ఎన్నికల తరువాత.. ఇక తాను చేసే వృత్తి నుంచి తప్పుకుంటానని చెప్పారు. అంతే, దీని వెనుకు ఉన్న వ్యూహాల గురించి రాజకీయ పండితులు విశ్లేషించడం ప్రారంభించేశారు.

బీజేపీకి సవాల్‌ విసిరిన ప్రశాంత్‌ కిషోర్‌
బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ 100కు పైగా సీట్లు గెలిస్తే.. తాను చేసే వృత్తి నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు ప్రశాంత్‌ కిషోర్‌. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 90 సీట్లు కూడా దాటలేకపోయింది. అలాంటిది బెంగాల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇక తన వృత్తి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించేశారు. అసలు దీని వెనుక ఉన్న కారణంగా ఏంటి!

పూర్తి స్థాయి రాజకీయాలపై ప్రశాంత్‌ కిషోర్‌ దృష్టి!

ఎన్నికల వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెప్పిన ప్రశాంత్‌ కిషోర్‌.. ఇకపై పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి సారించనున్నారా? జేడీయూలో చేరి, తిరిగి బయటకు వచ్చేసిన తాను ఒక విఫల రాజకీయ నాయకుడినని చెప్పుకునే ప్రశాంత్‌ కిషోర్‌ మున్ముందు ఏం చేయనున్నారు అన్నది దేశ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రశాంత్‌ కిషోర్‌ రాజ్యసభకు వెళ్లాలనుకుంటే అది ఆయనకు ఏమంత కష్టమైన పనేంకాదు. కానీ, తన భవిష్యత్తుపై ఎలాంటి స్పష్టత ఇవ్వని ప్రశాంత్‌ కిషోర్‌ను ఏ రాజకీయ పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఆయన భవిష్యత్తు ప్రణాళికలపై అన్ని పార్టీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

బీజేపీపై ప్రశాంత్‌ కిషోర్‌ కాలుదువ్వినట్టేనా!

దేశంలోని అనేక రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్‌ కిషోర్‌.. ఎన్నడూ కూడా ఫలితాల అనంతరం మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. అలాంటి పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు అతనితో మీడియాతో మాట్లాడేలా చేశాయనడంలో అతిశయోక్తిలేదు. బెంగాల్‌లో ఎలాగైనా పాగా వేయాలని సర్వశక్తులు ఒడ్డిన బీజేపీ.. అన్ని రకాలుగా వ్యవస్థలను, అధికార యంత్రాంగం దుర్వినియోగానికి పాల్పడిందని తీవ్ర స్థాయిలో విరుచుకుబడ్డారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘంపై ఆయన చేసినన్ని విమర్శలు ఇటీవల కాలంలో ఏ ఒక్కరూ చేసిన దాఖలాలు లేవని చెప్పవచ్చు.

ఎన్నికల సంఘం కేంద్రంలోని బీజేపీకి అనుబంధంగా పనిచేస్తోందని, బెంగాల్‌ బీజేపీ గెలుపునకు ఎన్నికల కమిషన్‌ పూర్తి సహాయ సహకారలు అందించిందని ఆయన విమర్శించారు. బెంగాల్‌ ఎన్నికలను 8 దశల్లో నిర్వహించడమే అందుకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. 45 రోజుల ఎన్నికల ప్రక్రియతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. మమతా బెనర్జీని ఎన్నికల ప్రచారం నుంచి కొన్ని రోజులపాటు నిషేధం విధించడం.. బీజేపీకి అనుకూలంగా పనిచేసే అధికారులను ఎన్నికల విధుల్లో నియమించడం లాంటి చర్యలతో ఎన్నికల సంఘం బీజేపీకి ఎంత మేలు చేయాలో అంత చేసిందని ఆయన వివరించారు. బీజేపీ నేతలు మత ప్రాతిపదిన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఎన్నికల సంఘం సంస్కరణలపై దేశంలోని రాజకీయ పార్టీలు గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా సంస్కరణలు రావాల్సిన అవసరం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశం నీ అడుగులను గమనిస్తుంది ప్రశాంత్‌

ఇక ఎన్నికల సంఘం మాట అటుంచితే.. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని సెక్యులర్‌ శక్తులను ప్రశాంత్‌ కిషోర్‌ ఏకం చేసే బాధ్యతలను తీసుకొనే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రశాంత్‌ కిషోర్‌ పనిచేయాలనుకుంటే.. దేశంలోని సెక్యులర్‌ శక్తులను ఏకం చేసే బాధ్యతలను ఆయనే తీసుకోవాలని కోరుకొనే వారు అనేకం. బీజేపీని ఎదుర్కోవాలంటే అలుపెరగకుండా పోరాటం చేయడం ఒక్కటే మార్గమని చేప్పే ప్రశాంత్‌ కిషోర్‌.. మున్ముందు ఆయన వేసే ప్రతి అడుగును దేశం గమనిస్తుందనే విషయం మాత్రం వాస్తవం. ఏది ఏమైనా.. తాను ఎన్నికల వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ఆయన చెప్పినా.. దేశంలో మున్ముందు చోటుచే సుకొని రాజకీయ పరిణామాల వెనుక ‘మాస్టర్‌ మ్యాండ్‌’ ఎప్పటికీ ఉంటాడు.

 

https://marketingstrategies.in/2021/05/07/poll-strategist-prashant-kishor-quits-his-profession/

50 thoughts on “వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహం ఏంటి..!

  1. A lot of thanks for your entire hard work on this blog. Ellie take interest in carrying out internet research and it’s easy to understand why. Almost all know all concerning the dynamic mode you make informative information through this blog and in addition improve participation from others on this theme then our favorite daughter is without a doubt starting to learn a lot of things. Have fun with the rest of the new year. You’re the one carrying out a fantastic job.

  2. I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.

  3. Your article gave me a lot of inspiration, I hope you can explain your point of view in more detail, because I have some doubts, thank you.

  4. Your article gave me a lot of inspiration, I hope you can explain your point of view in more detail, because I have some doubts, thank you.

  5. Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?

Leave a Reply

Your email address will not be published.